1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"ప్రేమికుల రోజు" కునాల్ చివరి చిత్రం!

వినోదం వెండితెర కథనాలు ప్రేమికుల రోజు కునాల్ చివరి చిత్రం నా చెలియా
"ప్రేమికుల రోజు" సినిమాతో యువత మనసును దోచుకుని తిరిగి రాని లోకానికి చేరుకున్న "కునాల్" నటించిన చివరి చిత్రం "నా చెలియా". విక్రమ్, శివాణి హీరోహీరోయిన్లుగా, జి. కిచ్చా దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన "నన్బనిన్ కాదలి" చిత్రాన్ని ఆధారంగా తీసుకుని శ్రీ మూవీ మేకర్స్ సమర్పణలో పీలా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనుంది.

పీలా నీలతిలక్ అనువదిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ నెల 8వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఇటీవలే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. గోవాలో60శాతం, విశాఖలో 40 శాతం చిత్రీకరణ జరుపుకుందని, తమిళంలో ఇటీవలే విడుదలై అర్థశతదినోత్సవం జరుపుకుందని చెప్పారు.

ప్రవీణ్ చక్రవర్తి చక్కని సాహిత్యానికి దేవా అద్భుతమైన సంగీతం అందించారని, బతుకుతెరువు కోసం గోవా వెళ్ళిన హీరోకు అనుకోకుండా హీరోయిన్, చిన్ననాటి స్నేహితుడు పరిచయం కావడం, చివరకు హీరోయిన్ ప్రేమలో పడిన ఇద్దరు స్నేహితులలో ఆ అమ్మాయి ప్రేమ ఎవరికి దక్కిందనే ఆసక్తి కరమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని నిర్మాత వెల్లడించారు. ఇక 25 ప్రింట్లతో విడుదల కానున్న ఈ సినిమాకు మాటలు, పాటలు... ప్రవీణ్ చక్రవర్తి, కెమెరా... డి. శంకర్, సహనిర్మాత... ఆడారి ఆనంద్.
About Writer
Selvi