1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కన్నడంలో రీమేక్ అవుతున్న"ఢీ","రెడీ"!

వినోదం వెండితెర కథనాలు ఢీ రెడీ విష్ణువర్ధన్ రామ్ జెనీలియా కన్నడం రీమేక్
WD
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు విష్ణువర్ధన్, జెనీలియా నటించిన "ఢీ", సినిమా కన్నడంలోనూ రెడీ కానుంది. అదే విధంగా "దేవదాసు" హీరో రామ్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో విడుదలైన "రెడీ" సినిమా కూడా కన్నడంలో రూపుదిద్దుకోనుంది.

టాలీవుడ్‌లో ఢీ, రెడీ వంటి ఫ్యాన్సీ టైటిల్స్‌తో సక్సెస్‌ను చవిచూసిన ఈ రెండు సినిమాల్లో... "ఢీ" సినిమాకు సంబంధించిన రీమేక్ అనుమతులను కన్నడ నిర్మాత ఆదిత్య ఇప్పటికే సొంతం చేసుకున్నారు. మరోవైపు "రెడీ" సినిమా రీమేక్ రైట్స్‌ను పునీత్ రాజ్‌కుమార్‌ కైవసం చేసుకున్నారు.
WD

ఇదిలా ఉండగా, పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, త్రిష నటించిన "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమాను కన్నడలోకి రీమేక్ చేస్తున్నారు. ఇకపోతే కన్నడలో"ఢీ"కి నిర్మాణ సారథ్యం వహించే ఆదిత్యనే.. హీరో (విష్ణువర్ధన్) పాత్రను పోషించడం విశేషం.