1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సాయికుమార్-ప్రేమ జంటగా ''జైభద్రకాళి''

సుదీర్ఘకాలం తర్వాత కోడిరామకృష్ణ ఒక చిత్రానికి దర్శకత్వం
FileFILE
సుదీర్ఘకాలం తర్వాత కోడిరామకృష్ణ ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వచ్చే దసరా పండుగకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ టైటిల్ పాత్రను పోషిస్తుండగా, సాయికుమార్, ప్రేమలు ప్రేమికులుగా నటిస్తున్నారు. హీరో సాయికుమార్.. ఈ చిత్రంలో విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నారు. పగటి పూట ఓ కవిగాను, రాత్రిపూట పాముగా మారటం ఇలా రెండు పాత్రల్లో నటిస్తున్నారు.

ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా పలు అడ్డంకుల తర్వాత ఇప్పటికి పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నట్టు చిత్రం యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని దసరా పండుగకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు కోడిరామకృష్ణ తెలిపారు. అలాగే చిత్ర కథ గురించి మాట్లాడుతూ.. భక్తి అంటే ఒక కొబ్బరి కాయ కొట్టి తమ ప్రార్థించడం కాదు. సమస్యతో పోరాటం చేయడమే భక్తి.

ప్రేమికులుగా ఉంటూ.. కలుసుకోలేక పోయిన ప్రేమికులుగా సాయికుమార్, ప్రేమలు నటిస్తున్నారు. సాయికుమార్‌ది ఓ ఛాలెంజ్‌తో కూడిన పాత్ర. అలాగే ప్రేమకు 'దేవి' చిత్రం తరహా పాత్ర. విధిని ఎదిరించలేరు. కానీ, విధి గుప్పిట్లో ఉన్నప్పటికీ.. ప్రేమను ఎలా పొందగలిగింది అన్నదే ఈ చిత్ర కథ. వందేమాత్రం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చినట్టు వివరించారు.

ఇక హీరో సాయికుమార్ మాట్లాడుతూ.. ఇది యూనివర్శల్ సబ్జెక్ట్. హాలీవుడ్ స్థాయిలో చిత్రాలను మనమూ తీయగలమనే ఈ చిత్రం రుజువు చేసింది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇది ఈ చిత్రంతో నెరవేరింది. ఈ చిత్రానికి కెమెరా.. కోడి లక్ష్మణ్, మాటలు.. తోటపల్లి మధు, పాటలు.. జొన్నవిత్తుల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. కోడిరామకృష్ణ, నిర్మాత..బివి.శ్రీనివాస్.
About Writer
PNR