రవితేజ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "నేనింతే". చిత్రాన్ని యూనివర్శల్ అధినేత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 21 తేదీ నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా గురించి డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ... ఇప్పటివరకు టాకీ సన్నివేశాలను, యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించామని చెప్పారు.
జగన్, రవితేజ కాంబినేషన్ అంటేనే సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఈ చిత్రం తమ బేనర్‌కు మంచి పేరు తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.