"సంతోషం" వార పత్రిక ప్రవేశపెట్టిన సినీ అవార్డుల ప్రధానోత్సవం శనివారం రాత్రి మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. సంతోషం ఆరో వార్షికోత్సవం సందర్భంగా 2007లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులను అందజేశారు. సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, బాలకృష్ణ, వెంకటేష్, బాలసుబ్రహ్మణ్యం, అంబికా కృష్ణ, బాబూ మోహన్, బ్రహ్మానందం, లయ, మీనా వంటి సినీ తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శివారెడ్డి, కోమలి సిస్టర్స్, చిట్టిబాబు, గౌతంరాజుల మిమిక్రీ, చక్రి సంగీతం, అమ్మారాజశేఖర్ డాన్స్‌ల నడుమ అట్టహాసంగా సాగిన ఈ వేడుకల్లో ఉత్తమ నటుడు రాజేంద్రప్రసాద్, ఉత్తమ నటి భూమిక (అనసూయ), ఉత్తమ విలన్ రవిబాబు (అనసూయ), సహాయనటుడు కోట శ్రీనివాసరావు (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే), స్పెషల్ జ్యూరీ అవార్డు ఆకాష్ (ఆనందం), రాజీవ్ (నోట్‌బుక్), హన్సిక (దేశముదురు), ప్రైమరీ అవార్డ్స్ ఇలియానా, ఉత్తమ కమేడియన్ బ్రహ్మానందం, ఉత్తమ ఎడిటర్ అవార్డును గౌతం రాజు అందుకున్నారు.
ఇకపోతే నిర్మాతగా సి.సి.రెడ్డి, కమర్షియల్ డైరక్టర్ శ్రీనువైట్ల, స్క్రీన్‌ప్లేగా శేఖర్ కమ్ముల (హ్యాపీడేస్), ఉత్తమ పరిచయ నిర్మాత వెంకటేశ్వరరావు (వేడుక), సింగర్స్ కౌసల్య, కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ (యమదొంగ), పాట రచయిత అనంత శ్రీరామ్ (చందమామ), లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ఎస్.పి.బాబు. అల్లూరామలింగయ్య స్మారక అవార్డు బాబూ మోహన్ అందుకున్నారు.
|