కృష్ణభగవాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో విశ్వప్రసాద్ దర్శకత్వంలో ఎస్.ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై రమేష్ చంద్ర బెనర్జీ బాబు నిర్మిస్తున్న "మిస్టర్ గిరీశం" రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్రం గురించి చెబుతూ... ప్రధాన తారాగణంతో ఇప్పటివరకు 70శాతం షూటింగ్ పూర్తయిందని అన్నారు.
ఈ నెల రెండో వారంలో మూడో షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని, దీంతో టాకీ పూర్తవుతుందని చెప్పారు. నాల్గవ షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్, అరకులలో చిత్రీకరించనున్నట్లు వివరాలందించారు. ఇందులో ఐదు పాటలున్నాయని, ఎస్.ఎ.ఖూద్దస్ చక్కని బాణీలు సమకూర్చారని, దేనికవి విభిన్నంగా ఉంటాయని, ప్రతి పాటలోనూ కథ ఇమిడి ఉంటుందన్నారు.
వినాయకచవితి నాడు ఆడియోను, సెప్టెంబర్ నెలాకరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఈ సినిమాకు మాటలు... కె.వేణుభార్గవ్, పాటలు... కులశేఖర్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, పెద్దాడమూర్తి, కెమెరా... రాజేష్ కాటా.
|