ఉదయకిరణ్, అతిథిశర్మ జంటగా మదన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "గుండెఝల్లుమంది". ఈ సినిమా ఆడియో వెల్స్ రికార్డింగ్ ద్వారా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ ఆడియోసీడీని ఆవిష్కరించి సంగీత దర్శకుడు కీరవాణికి అందించారు. ఆడియో క్యాసెట్‌ను హీరో నవదీప్ విడుదల చేసి హీరోయిన్ అతిథి శర్మకు అందించారు. ఫ్రెండ్‌షిఫ్‌డేను పురస్కరించుకుని 'రేడియో సిటీ' ఏర్పాటు చేసిన కాంటెస్ట్ ద్వారా ఐదుగురు జంటలను ఎంపిక చేసి చిత్రంలోని తలోపాటను వారిచేత ఆవిష్కరింపజేశారు.
అనంతరం ఇ.వి.వి మాట్లాడుతూ... 'పెళ్ళయిన కొత్తలో' చూశానని, మదన్ బిజీ దర్శకుడిగా అవుతాడనిపించిందని చెప్పారు. ఈ సినిమాను చాలా చక్కగా తీశాడని, తనకు ఇష్టమై సంగీత దర్శకుడు కీరవాణి అని, మెలోడి బాణీలను ఆయన చక్కగా సమకూర్చుతాడని చెప్పారు. ఈ పాటలింటుంటే గుండెఝల్లుమందన్నారు. ఇకపోతే ఈ చిత్ర నిర్మాత పరుచూరి శివప్రసాద్ మంచి స్నేహితుడని, ఈ చిత్రం విజయవంతంకావాలని ఆకాంక్షించారు.
సినీ దర్శకుడు మదన్ మాట్లాడుతూ... మదన్ తమ తర్వాతి చిత్రానికి సంగీతం ఇవ్వమని అడిగితే 'గుండెఝల్లుమంది'. అని, ఈ సినిమా ప్రేక్షకుల గుండెఝల్లు మనేలా చక్కని బాణీలు సమకూర్చానని చెప్పారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు.
సినీ నటుడు ఉదయకిరణ్ మాట్లాడుతూ... టీమ్ వర్క్‌తో చిత్రాన్ని పూర్తి చేశామని, ఈ సినిమా చిత్ర యూనిట్‌కు మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, చంద్రసిద్ధా, శ్రీనువైట్ల, ఎంఎల్. కుమార్ చౌదరి, నవదీప్, అతిథిశర్మ, రాంప్రసాద్, శివశక్తి దత్తా... శ్రీనయ్య, చైతన్యప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.
|