ఎన్.టీ.ఆర్‌తో ప్రారంభమైన తన వైజయంతిమూవీస్ సంస్థలో ఎంతోమంది అగ్రహీరోలు, దర్శకులు పనిచేశారని అశ్వనీదత్ చెప్పారు. సినీహీరోలు, దర్శకుల వల్లే తాను ఈ స్థితికి చేరుకున్నానని, వారంతా స్నేహితుల్లా మెలిగారని ఫ్రెండ్‌షిప్‌డే రోజు వారందర్నీ తలుచుకుంటే పులకరించిపోతుందని అశ్వనీదత్ చెప్పారు. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన "కథానాయకుడు" చిత్ర యూనిట్ ఫ్రెండ్‌షిప్‌డేను పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని విష్పర్‌వేలీలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది.
ఈ సమావేశంలో అశ్వనీదత్ మాట్లాడుతూ...తన పతాకంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడించారు. రజనీకాంత్ నటించడంతో తన బేనర్‌కు పరిపూర్ణత చేకూరిందని, ఇక తన బేనర్‌లో చేయాల్సిన హీరోలు దర్శకులంటూ ఎవ్వరూలేరని చెప్పారు. దీంతో తృప్తి చెందుతున్నానని, ఇకమీదట తన బేనర్‌లో నిర్మాత అయిన తన కుమార్తె పేరుంటుందని అశ్వనీదత్ తెలిపారు. 90 రోజుల్లో రెండు భాషల్లో సినిమాను పూర్తి చేయడం చాలా గ్రేట్ అని, ఇంతవరకు ఎవరూ అలా తీసి ఉండరని పేర్కొన్నారు.
చిత్ర దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ... స్నేహాన్ని గురించి సినిమా బాగా తీశామని, దీనికి అందరూ సహకరించారని చెప్పారు. సునీల్ బాగా చేశాడని, రజనీ ఆయన్ను మెచ్చుకున్నారని తెలిపారు. కెమెరా ముందుకెళ్లాడంటే సునీల్ మనిషికాదని ప్రశంసించారని తెలిపారు.
జగపతిబాబు గురించిమాట్లాడుతూ... రజనీ స్నేహితుడిలా? ఎవరా? అని ఆలోచించగా...తమిళ ఇండస్ట్రీకి తెలియని కొత్త వ్యక్తి అయితే బాగుండునని అనుకున్నామని వెల్లడింతారు. అప్పుడు జగపతిబాబు గుర్తుకువచ్చారన్నారు. ఆయన స్వరం కళ్ళు బాగా ఆకట్టుకున్నాయిని, అందుకే ఆయన్ను పిలిపించామన్నారు. ఆకట్టుకున్నట్లుగానే జగపతి బాబు చాలా బాగా నటించాడని చెప్పారు.
సునీల్ స్పందిస్తూ... రజనీకాంత్‌తో నటించడమంటేనే లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్‌గా భావిస్తున్నానని చెప్పారు. ఆయన గొప్పమానవతావాదని, ఈ సందర్భంగా వడివేలుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాన్నారు. ఆయన్ను ఇమిటేట్ చేస్తూ చాలా చిత్రాల్లో నటించానని చెప్పారు. ఇక పి. వాసు, అశ్వనీదత్ వంటి గొప్ప వ్యక్తులతో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
జగపతిబాబు మట్లాడుతూ... రజనీకాంత్‌లో కలిసి సెట్లో ఉన్నానని ఇంకా నమ్మబుద్ధి అయ్యేదికాదని, రజనీతో కలిసి నటించడం గొప్పవరంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయనతో ఉన్నంతసేపు చాలా విషయాలు నేర్చుకున్నానని, గొప్ప ఫిలాసఫర్ ఆయనలో ఉన్నాడని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు గౌతంరాజు, కొండవలస, మీనా, మమత, తదితరులు పాల్గొన్నారు.
|