జె.డి చక్రవర్తి, జగపతిబాబు, మమతామోహన్‌దాస్, మధురిమ కాంబినేషన్‌లో కిరణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం "హోమం". ఈ చిత్రానికి జె.డి చక్రవర్తి దర్శకత్వ వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజికల్స్ ద్వారా యాడ్ ల్యాబ్స్ థియేటర్‌లో విడుదలైంది. ముఖ్య అతిథి జె.డి చక్రవర్తి స్నేహితుడు రామ్ గోపాల్‌వర్మ ఆడియో ఆవిష్కరించి దిల్‌రాజుకు అందించారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్‌వర్మ మాట్లాడుతూ... తన దగ్గర వచ్చేవారికి కాస్త తిక్క ఉంటుందని...అందులో జె.డి చక్రవర్తికి తన దగ్గరకు వచ్చేముందు వచ్చిందా? లేదా వచ్చిన తర్వాత వచ్చిందా? అనేది తెలియట్లేదని చెప్పారు. వెరైటీ ఆలోచనలతో చిత్రాలు తీయాలంటుంటాడని అన్నారు.
మొన్ననే హోమం చిత్రాన్ని చూశానని, బాగా తీశాడని చెప్పారు. దిల్ రాజుది "గోల్డెన్ హ్యాండ్" అని ప్రశంసించారు. ఆయన ఏది చేసినా విజయవంతం అవుతుందని, ఏది పట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసున్నాన్నారు. ఈ సినిమాను రాష్ట్రం మొత్తం విడుదల చేయడం పట్ల ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జగపతి బాబు మాట్లాడుతూ... తాను హీరోగానిలదొక్కుకోవడానికి రామ్‌గోపాల్‌వర్మ ఓ కారణమన్నారు. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా... వర్మ తీసిన "గాయం" తర్వాతే మంచి పేరు వచ్చిందని చెప్పారు. తన వాయిస్ బాగా హైలెట్ అయిందన్నారు. హోమం సినిమాలోజె.డి తనకు మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సాహించారన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ... ఈ సినిమాలో తొలుత రెండు సీన్లు, పాటలు చూపించారని, మొత్తం సినిమాను చూడాలనే సరికి ఆ తర్వాత చూపించారని చెప్పారు. స్క్రీన్‌ప్లేలో కొద్దిగా లోపం ఉందని తెలిపారు. అనంతరం దానిని సరిచేసుకున్నారు. నైజాంలో మా వెంకటేశ్వరఫిలింస్ ద్వారా విడుదల చేస్తామనుకున్నామన్నారు.
ఆ తర్వాత తన తమ్ముడు శిరీష్‌ను చూడమన్నాక... అతడు సినిమాను చూసి ఆదినుండి సినిమా మొత్తం మనమే రిలిజ్ చేద్దామని చెప్పారన్నారు.
|