1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రజనీకాంత్ చేతుల మీదుగా "సరోజ" ఆడియో

వినోదం వెండితెర కథనాలు రియల్ స్టార్ శ్రీహరి రజనీకాంత్ చేతుల మీదుగా సరోజ ఆడియో  వెంకట్ ప్రభు దర్శకత్వం
WD
రియల్ స్టార్ శ్రీహరి, వైభవ్, కాజల్, ప్రకాష్ రాజ్, నిఖిత ప్రధాన పాత్రధారులుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మిస్తున్న చిత్రం "సరోజ". ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడియో ఆవిష్కరించి తొలి సీడీనీ పిరమిడ్ సాయిమీరా విశ్వనాథన్‌కు, మలి సీడీని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందజేశారు.

ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ... ఇప్పటికే డబ్బింగ్ పూర్తయిందని, ప్రస్తుతం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అన్నీ కార్యక్రమాలు ముగించుకుని ఈ నెలాఖరులో విడుదలకు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ చిత్రం ఆడియోను జింగ్‌లీ ఆడియో మార్కెట్ చేస్తోంది.