1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

స్వాతంత్రదినోత్సవానికి ముందు "బలాదూర్"

వినోదం వెండితెర కథనాలు స్వాతంత్రదినోత్సవం ముందు బలాదూర్ చిత్ర నిర్మాత డి. సురేష్ బాబు
WD
స్వాతంత్రదినోత్సవానికి ముందు ఎప్పుడైనా "బలాదూర్" చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత డి. సురేష్ బాబు వెల్లడించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.

ఇంతకుముందు రవితేజ చిత్రాలకంటే బెస్ట్ ఆడియోగా అమ్మకాలు బాగున్నాయని, ఇంకా మూడు రోజుల్లో తొలికాపీ సిద్ధం కానుందని చెప్పారు. ఆ తర్వాత సెన్సార్ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. "ఇండియా నా పోలీస్" అనే దేశం నుంచి "అందమైన కుటుంబం" అనే పాట బాగా నచ్చిందని ఓ శ్రోత ఫోన్ చేసి చెప్పడం నిజమైన ప్రశంసగా భావిస్తున్నానని, శుభ సంకేతంగా ఫీలవుతున్నానని చెప్పారు. ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయనడానికి ఇదో చక్కని ఉదాహరణ అని రాధాకృష్ణ ట్యూన్స్ బాగా ఇచ్చారని, అలాగే గుండెల్లో ఇల్లుంది.. అనే పాట తనకు బాగా నచ్చిన పాటని తెలిపారు.

రాధాకృష్ణ మాట్లాడుతూ.. బేనర్ సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేయడం ఇష్టంగా భావిస్తున్నానని, కథలో క్లారిటీ ఉంటేనే సంగీతం బాగా వస్తుందని, ఉదయ్ శంకర్ చక్కని కథకు ఈ సంగీతం తోడయిందని, మాంటేజ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని అన్నారు.

దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. విజువల్ పాటలు బాగా వచ్చాయని, విడుదల తర్వాత మరింతగా ఆదరణపొందుతాయని చెప్పారు.