1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శ్రీకాంత్, మీరాజాస్మిన్‌ జంటగా "అ..ఆ...ఇ...ఈ.."

వినోదం వెండితెర కథనాలు శ్రీకాంత్ మీరాజాస్మిన్‌  కల్పన ఆర్ట్స్ శ్రీకారం  అ..ఆ...ఇ...ఈ.
WD
శ్రీకాంత్, మీరాజాస్మిన్‌లతో "అ..ఆ...ఇ...ఈ.." (అతను ఆమె... ఇంతలో ఈమె..) అనే అర్థంలో వచ్చేలా కొత్త సినిమాకు శ్రీ కల్పన ఆర్ట్స్ శ్రీకారం చుట్టింది. అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, చందనా బ్రదర్స్-బొమ్మనా సిస్టర్స్ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

బొద్దం అశోక్ యాద్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి జూబ్లీ హిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి వివరాలను తెలియజేస్తూ... తన చిత్రాలకు టైటిల్స్ వెరైటీగా దొరకడమే కాకుండా సగం సక్సెస్‌గా భావించేటట్లు ఉంటాయని అన్నారు.

విజయ్‌కుమార్ ఫోటోగ్రఫీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇప్పటికే ఆ కల నెరవేరిందని చెప్పారు. శ్రీకాంత్, మీరా జాస్మిన్‌ల కాంబినేషన్‌లో తాను చేస్తున్న రెండో సినిమా ఇదని, తన గత చిత్రాలకన్నింటికంటే ఈ సినిమా స్టోరీ బెస్ట్‌గా ఉంటుందని చెప్పారు.

కామెడీతో పాటు సెంటిమెంట్‌కూడా మిళితమైన సినిమా ఇదని, తనను దర్శకుడిగా పరిచయం చేసిన "ఆషాడం పెళ్లికొడుకు" చిత్ర నిర్మాతకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాత చెప్పారు.

అలీ మాట్లాడుతూ... శ్రీనివాస రెడ్డి అసిస్టెంట్ డైరక్టర్‌ నుంచి బాగా తెలుసునని, తన ఎనిమిదో చిత్రం "ఆషాడం పెళ్ళికొడుకు" చిత్రానికి దర్శకత్వం వహించారని గుర్తు చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యనారాయణల పంథాను ఆయన కొనసాగిస్తున్నారని, నిర్మాతలకు అనువైన ఈ దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కూనిరెడ్డి శ్రీనివాస రెడ్డి, నటి కవిత, నోళ్ళపాటి నాగేశ్వరరావు, అపూర్వ తదితరులు మాట్లాడుతూ... శ్రీనివాసరెడ్డి గొప్ప మానవతావాదని ప్రశంసించారు.