అక్కడ నన్ను నేను మర్చిపోయాను : శిల్పాశెట్టి
|
ఆ ఆధ్యాత్మిక కేంద్రంలోని సుందరమైన ప్రకృతి, నిశ్శబ్ధం తదితర అంశాలు శిల్పాశెట్టిని కట్టిపడేశాయట. అక్కడి ఆ రమణీయ వాతావరణంలో మూడురోజులపాటు శిల్పాశెట్టి మౌనంగా గడిపిందట. ఇంతలా శిల్పాశెట్టిని మైమరపించిన ఆధ్యాత్మిక ప్రదేశానికి సంబంధించిన వివరాలు ఆమె నోటి నుంచే...
ఇటీవల నా స్నేహితురాలి ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల వరదయ్యపాళెం అనే ప్రాంతానికి దగ్గరగా ఉన్న వన్‌నెస్ యూనివర్సిటీ అనే ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించాను. అక్కడికి చేరుకున్న నాకు అక్కడి వాతావరణం ఎంతగానో నచ్చింది. దీంతో పది నిమిషాలకు మించి మౌనంగా ఉండలేని నేను ఏకంగా మూడు రోజులపాటు మౌనవ్రతాన్ని పాటించాను.
అంతేనా అక్కడున్న ఆధ్యాత్మిక గురువులను కలుసుకోగానే ఏదో మహత్తర శక్తి నాలో ప్రవేశించినట్టు అనిపించింది... అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని వినిపించింది. కొద్దిరోజుల క్రితం యోగాపై ఉపన్యాసం, ఇప్పుడేమో ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాశస్త్యం ఇలా శిల్పాశెట్టి మాటలు వింటుంటే తొందర్లో శిల్పాశెట్టి ఏదైనా ఆశ్రమాన్ని స్థాపించబోతోందా అన్న సందేహం వస్తోంది కదూ.