1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆగస్టు 8న "బ్లాక్ అండ్ వైట్" ఆడియో

వినోదం వెండితెర కథనాలు ఆగస్టు 8న బ్లాక్ అండ్ వైట్ ఆడియో రాజీవ్ కనకాల సింధుతులానీ జంట
WD
రాజీవ్ కనకాల, సింధుతులానీ జంటగా, శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "బ్లాక్ అండ్ వైట్". మారుతి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉదయ్ శంకర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న "బ్లాక్ అండ్ వైట్" ఆడియో ఈ నెల 8వ తేదీన విడుదల కానుందని దర్శకుడు తెలిపారు.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఓ ఇంజనీర్, ఫ్యాషన్ డిజైనర్‌ను ప్రేమించి, వివాహం చేసుకుని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కథాశంతో ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, విజయ్ కురకుల అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని అన్నారు.

ఈ సినిమాకు సంగీతం కూడా మరో హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత ఆకాంక్షించారు. ఆడియోను ఆగస్టు 8న విడుదల చేసి, సినిమాను ఇదే నెల మూడో వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అలీ, జీవా, ఉత్తేజ్, రాజ్ భరత్, సి.వి.ఎస్. నరసింహారావు, సందేశ్, జూనియర్ రేలంగి, సురేఖ్ వాణి, అయేషా జలీల్, జెన్నీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు పాటలు... వనమాలి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... శ్రీకాంత్ వేములపల్లి.