విడుదలకు సిద్ధమౌతోన్న ముమైత్ "టార్గెట్"
|
క్రైం, యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలోని, ప్రతీ పాత్ర ఓ టార్గెట్‌ను లక్ష్యం చేసుకుని పయనిస్తుందని నిర్మాత అన్నారు. చిత్రంలోని అన్ని పాటలు మెలోడీగా ఉంటాయని, శ్రోతలను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే ముమైత్ ఖాన్ చేసే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు.
కచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చిన నిర్మాత, ఆగస్టు మధ్యలో ఆడియోను, నెలాంతానికి సినిమాను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కృష్ణభగవాన్, వేణుమాధవ్, జీవా, రియాజ్ ఖాన్, కొండవలస లక్ష్మణ రావు, విజయరంగరాజు, గౌతం రాజు, గీతా సింగ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం... కోటీ, కెమెరా... వి.ఎన్. సురేష్ కుమార్, మాటలు... వెలిగొండ శ్రీనివాస్, ఎడిటింద్... రమేష్.