శ్రీకాంత్-శ్రీహరి కాంబినేషన్‌లో కొత్త చిత్రం!
Publish: Wed, 6 Aug 2008 (12:48 IST)
Updated: Wed, 6 Aug 2008 (12:47 IST)
శ్రీకాంత్-శ్రీహరి కాంబినేషన్‌లో త్వరలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. మౌర్య దర్శకత్వంలో... తోట వెంకటేశ్వరరావు నిర్మాత సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సినీ వర్గాల సమాచారం. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా షూటింగ్‌కు ముహూర్తం పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలతో మిళితమై విభిన్న కథాకోణంలో చిత్రీకరించనున్నారు. ఇంకా మిగిలిన తారాగణాన్ని ఎంపికచేయాల్సి ఉంది.
ఇకపోతే శ్రీహరి తాజాగా... "శ్రీశైలం" సినిమాలో విభిన్నంగా బస్సు డ్రైవర్ పాత్రను పోషిస్తున్నారు. శ్రీకాంత్, మీరాజాస్మిన్ జంటగా అ..ఆ...ఇ..ఈ అనే కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. శ్రీ కల్పన ఆర్ట్స్ పతాకంపై రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెప్పారు.