ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు > ఆగస్టు 26న చిరు పార్టీ..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆగస్టు 26న చిరు పార్టీ..? Search similar articles
WD
రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ.. మధర్ థెరిసా పుట్టిన రోజైన ఆగస్టు 26వ తేదీన రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. చిరు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న చిరంజీవి పార్టీ ఏర్పాటుపై... ఈ నెల (ఆగస్టు) 17వ తేదీన ప్రకటించనున్నట్లు వినికిడి. అదే రోజున పార్టీ అజెండా, పార్టీ పేరు తదితర అంశాలను ప్రకటింబోనున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఏ రోజున పార్టీ పెడితే బాగుంటుందనే అంశంపై చిరు ఇప్పటికే జ్యోతిష్కులను సంప్రదించారని, సరైన సమయంలో చిరంజీవి రంగ ప్రవేశం చేస్తారని సన్నిహిత వర్గాల పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా, చిరంజీవి పార్టీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ మెగారైలు ప్రవేశానికి సంబంధించి నోరు మెదపక మౌనం పాటిస్తోంది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు చిరంజీవి పార్టీ అజెండా ఖరారు కోసం వేచి చూస్తున్నాయి.

"మెగాబండి" అజెండా ఖరారైతే చిరు పార్టీతో పొత్తు పెట్టుకునే... అంశంపై లెఫ్ట్ పార్టీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్ననేపథ్యంలో, చిరు పార్టీ ప్రారంభంతో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ... చిరు పార్టీ ఎప్పుడొస్తుందో... తదనంతరం చోటుచేసుకునే పరిణామాల కోసం వేచి చూడాల్సిందే... మరీ...!
మరిన్ని
శ్రీకాంత్-శ్రీహరి కాంబినేషన్‌లో కొత్త చిత్రం!
పూనమ్ సింగార్ హాట్ నెంబర్!
విడుదలకు సిద్ధమౌతోన్న ముమైత్ "టార్గెట్"
ఆగస్టు 8న "బ్లాక్ అండ్ వైట్" ఆడియో
అక్కడ నన్ను నేను మర్చిపోయాను : శిల్పాశెట్టి
శ్రీకాంత్, మీరాజాస్మిన్‌ జంటగా "అ..ఆ...ఇ...ఈ.."