"కథానాయకుడు" హీరో రజనీకాంత్ నటించే "రోబో" షూటింగ్‌లో మిస్ వరల్డ్ "ఐశ్వర్యారాయ్" సెప్టెంబర్ నుంచి పాల్గొననుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మిస్ వరల్డ్ ఐష్ మాట్లాడుతూ... గత కొన్ని వారాలుగా "రోబో" సినిమాకు సంబంధించిన గ్రౌండ్‌వర్క్ కార్యక్రమాల్లో శంకర్, రజనీ కాంత్ బిజీబిజీగా ఉన్నారని, ప్రస్తుతం ఆ పనులు పూర్తి కావడంతో సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే షూటింగ్‌లో తాను పాల్గొంటానని చెప్పింది.
ఇటీవల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చిన రజనీ కాంత్ "రోబో" గురించి మాట్లాడుతూ... రోబో సినిమా షూటింగ్ ప్రారంభం కోసం శంకర్ సన్నాహాలు చేస్తున్నారని, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సినిమాకు అయ్యంగరన్ నిర్మాత సారథ్యం వహిస్తుండగా, ఎరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై విడుదల కానుంది.
తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకోనున్న రోబో సినిమా షూటింగ్ ఆగస్టు 15వ తేదీ నుంచే ప్రారంభం కానుందని ఇటీవల చిత్ర యూనిట్ పేర్కొంది. మొత్తానికి "కథానాయకుడి"గా ప్రేక్షకులను అలరిస్తున్న రజనీ కాంత్ త్వరలో "రోబో"గా తెరపైకి రానున్నాడన్నమాట..!
|