అందుకే ఒప్పుకున్నా : కృష్ణంరాజు
|
సెకండ్ ఇన్నింగ్స్‌ను తన సంస్థ అయిన గోపీ కృష్ణామూవీస్‌లో ప్రభాస్‌తో కలిసి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వేరే అవకాశాలు రావడం, ఆ పాత్ర నచ్చడంతో కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతోన్న "శ్రీశైలం"లో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ తర్వాత ఓ నిర్మాత మూడు నెలలుగా ఆయన కోసమే ఎదురుచూడటంతో మొత్తానికి కథ విన్నారు.
విన్న తర్వాత పాత్ర పరంగా రియల్‌లైఫ్‌కి దగ్గరగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా పేరు "సమర్థుడు". ఇందులో కృష్ణంరాజు ఎం.ఎల్.ఎ.గా నటిస్తున్నారు. చిత్రం గురించి చెబుతూ.. ఇది రెగ్యులర్ పాత్రకాదని, ప్రజలకోసం ప్రజలే ఎన్నుకోబడిన బాధ్యతగల వ్యక్తి తప్పుచేయకూడదు. చేస్తే శిక్షింపబడాలనే పాయింట్‌తో రూపుదిద్దుకుంటోందని చెప్పారు.
|
దర్శకుడు అర్జున్ కొత్తవాడయినా కథ చెప్పే విధానం బాగా నచ్చింది. క్యారెక్టర్ ఫరంగా తనకు నచ్చితే... తన సతీమణి శ్యామలాదేవీకి మాత్రం కథంతా నచ్చిందని పచ్చజెండా ఊపారన్నారు. ఇంకేముంది లేడీస్‌కు నచ్చితే మంచి పాయింటే మరి.. అందుకే గోపీకృష్ణా మూవీస్‌లో ముందుగా చేయాలనుకున్నా... కాస్త పక్కనపెట్టి "సమర్థుడు"లో నటిస్తున్నానని కృష్ణంరాజు పేర్కొన్నారు.
దీనికి శ్యామలాదేవి స్పందిస్తూ... కథ విన్నవెంటనే బాగుందనిపించిందని, కృష్ణంరాజుగారి నిజజీవితానికి దగ్గరగానూ, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా చిత్రంగానూ అనిపించిందన్నారు.
దేవిక ప్రొడక్షన్స్, ఆరెంజ్ ఫ్రేమ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న "సమర్థుడు" చిత్రంలో మాస్ పాత్రను రాజా పోషిస్తున్నారు. ప్రజలకోసం ప్రాణాలిచ్చే నాయకుడికి, డబ్బుకోసం ప్రాణాలు తీసే హంతకుడికి మధ్య జరిగే కథే సమర్థుడని దర్శకుడు అర్జున్ వెల్లడించారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన ఈ షూటింగ్ అక్టోబర్ వరకు ప్రతినెలా 15 రోజుల పాటు జరుగుతుందని, నవంబర్‌లో ఫారిన్ పాటలు చిత్రిస్తామని చిత్ర నిర్మాత ఆకుల సురేష్ పటేల్ వెల్లడించారు.
"బుజ్జిగాడు మేడిన్ చెన్నై"లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంజన ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి కెమెరా... దత్తు, సంగీతం... వి. రాజశేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అర్జున్.