జీ సినిమాలో ''మజే కి ఆజాది''
|
'మజే కి ఆజాది' అనే కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 14వ తేదీన సూపర్ హిట్ చిత్రాలైన క్రాంతీవీర్ (9 am), గదర్ ఏక్ ప్రేమ్ కథ (12.30 pm), తిరంగ (4.30 pm), 23 మార్చ్ 1931 షాహీద్ (8.30 pm) చిత్రాలను ప్రదర్శించనున్నారు. అలాగే.. ఆగస్టు 15వ తేదీన బిగ్ బ్రదర్ (9 pm), కర్మ (12.30 pm), ఆపరేషన్ దుర్యోధన (4.30 pm), ఆబ్ తుమ్‌హారే వాహాలే వాటన్ సాధియాన్ (8.30 pm) చిత్రాలను ప్రదర్శించనున్నారు.
దీనిపై జీ సినిమా వాణిజ్య విభాగం హెడ్ మోహన్ గోపీనాథ్ మాట్లాడుతూ.. మజే కి ఆజాది కార్యక్రమం ద్వారా వీక్షకులు ఉత్సాహంగా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడమే కాకుండా.. అవినీతి, ఉగ్రవాద రహిత సమాజాన్ని కోరుకుంటునేలా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమం మొత్తం దేశ భక్తితో నిండి వుంటుందన్నారు.
స్వేచ్ఛాపూరిత సమాజం, రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు తయారు చేసే విధంగా ఉంటుందన్నారు. గతంలో తాము నిర్వహించిన పలు కార్యక్రమాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయని, ఇవి ఎంతో విజయవంతమైనట్టు చెప్పారు. ఇలాంటి ఆదరాభిమానాలనే వీక్షకులు ఇకపై చూపిస్తారని భావిస్తున్నట్టు మోహన్ గోపీనాథ్ కోరారు.