1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"సెల్యూట్" పబ్లిసిటీకీ 2.5 కోట్లు!

వినోదం వెండితెర కథనాలు విశాల్ లేటెస్ట్ తెలుగు సినిమా సెల్యూట్ పబ్లిసిటీ
WD
విశాల్ లేటెస్ట్ తెలుగు సినిమా "సెల్యూట్" పబ్లిసిటీ కోసం దాదాపు 2.5 కోట్లు వెచ్చిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌ ఎక్కడైనా ఖాళీ దొరికితే అక్కడ వినాయిల్‌ను ఏర్పాటు చేయడం, దూర ప్రాంతాల్లోనూ కటౌట్ పెట్టడం చేస్తున్నారు. మొదటి డబ్బింగ్ చిత్రం నుంచి పబ్లిసిటీపై శ్రద్ధపెట్టిన జి.కె.రెడ్డి... ఈసారి తన కుమారులకు ఆ బాధ్యత అప్పచెప్పారు.

దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో "సెల్యూట్" సినిమాను తీశారని తెలిసింది. ఈ విషయంలో నిర్మాత విక్రమ్‌కృష్ణకు, విశాల్‌కు (అన్నదమ్ములు) చిన్నపాటి గొడవకూడా జరిగింది. విపరీతంగా ఖర్చుపెట్టిస్తున్నాడని విక్రమ్ కృష్ణ అనడం, ఎంతైనా ఖర్చుచేయాలని విశాల్ పట్టుబట్టడం జరిగింది.

ఈ విషయమై విశాల్ మాట్లాడుతూ... బడ్జెట్ విషయంలో గొడవ జరిగినా.. ఆ తర్వాత దాని అవుట్‌పుట్‌తో విక్రమ్‌ను సంతృప్తిచెందడం జరిగింది. పగలు కోపపడినా సాయంత్రానికి మళ్ళీ కలిసిపోయేవారమని చెప్పారు.

ఏది ఏమైనా ఈ చిత్రానికి దిల్‌రాజు నైజాం, వైజాగ్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ సరైన థియేటర్లు లభ్యం కాకపోవడంతో వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
About Writer
Selvi