1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"ఆర్య-2"గా రానున్న బన్నీ!

వినోదం వెండితెర కథనాలు ఆర్య హిట్‌ అల్లు అర్జున్ ఆర్య-2 ప్రేక్షకులు
WD
"ఆర్య" హిట్‌తో యువతను ఆకర్షించిన అల్లు అర్జున్ ఆర్య-2గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో "ఆర్య-2" చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆదిత్య ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో పాటు శుక్రవారం ప్రారంభమైంది.

హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వినాయకుడు టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ తేజ, అల్లు అరవింద్, దిల్ రాజు, డా. కె. ఎల్. నారాయణ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఆదిత్యబాబు, బోగవల్లి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన, కాజల్ కథానాయికగా, నవదీప్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు.. ఆదిత్య బాబు, పి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. సుకుమార్.