1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సెంచరీ కొట్టిన బన్నీ "పరుగు"!

వినోదం వెండితెర కథనాలు సెంచరీ పరుగు ఆర్య అల్లు అర్జున్ దిల్ రాజు
WD
"ఆర్య"తో హిట్ కొట్టి యువత మనస్సును ఆకట్టుకున్న "బన్నీ" తాజా సినిమా "పరుగు" సెంచరీ కొట్టింది. శుక్రవారంతో "పరుగు" వందోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనడాకి "పరుగు" సినిమా ఓ ఉదాహరణగా పేర్కొన్నారు.

తమ బేనర్‌లో సెకండ్ హాట్రిక్‌ను "పరుగు" చిత్రమిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌కు ఆర్య, పరుగు హిట్లయితే... చిత్ర దర్శకుడు భాస్కర్‌కు బొమ్మరిల్లు, పరుగు రెండు హిట్స్ ఇచ్చాయని, త్వరలో తమ కాంబినేషన్‌లో మూడో చిత్రం కూడా రాబోతుందని వెల్లడించారు.

ఇది నిజమైన వందరోజుల సినిమా అని, మళ్లీ ఇదే బేనర్‌లో కొత్త చిత్రానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు హీరో అల్లు అర్జున్ తెలిపారు. 54 కేంద్రాల్లో నూరు రోజుల వైపు "పరుగు" పరుగులు తీస్తుందని దర్శకుడు భాస్కర్ అన్నారు.