సిద్ధమౌతోన్న ముమైత్ "టార్గెట్"
|
చిత్ర దర్శకుడు రమేష్ రాజా మాట్లాడుతూ.. మర్డర్, మిస్టరీతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని, అయితే ఎక్కడా అసభ్యతకు తావే లేదని, క్రైం కథలు రాసే రచయిత్రిగా ముమైత్ విభిన్న పాత్ర పోషిస్తుందని వివరించారు. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చెప్పారు.
ఇందులో శివబాలాజీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటిస్తున్నారని రమేష్ రాజా చెప్పారు. ఇకపోతే ఈ సినిమాకు కెమెరా... .ఎన్.సురేష్ కుమార్, ఎడిటర్... కె. రమేష్, నిర్మాతలు... సంగిశెట్టి దశరథ్, బి. రామకృష్ణ.