1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"మంజీర" షూటింగ్ పూర్తి!

వినోదం వెండితెర కథనాలు గౌతమ్ హీరో శ్రీదేవి హీరోయిన్‌ మంజీర
WD
గౌతమ్ హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "మంజీర". ప్రస్తుతం ఈ చిత్రషూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి చిత్ర హీరో మాట్లాడుతూ... కథ, కథను దర్శకుడు సాయిభాను చక్కగా తెరకెక్కించారని, ఈ చిత్రంలో రఘువరన్ పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. మాఫీయా డాన్‌గా నటించారని, ఆయన నటించిన ఆఖరి సినిమా ఇదేనన్నారు. తనకు అనారోగ్యమున్నా అనుకున్న టైమ్‌కు సెట్‌కు వచ్చి పూర్తి చేయగలిగారని ఉదయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రఘువరన్‌కు శ్రద్ధాంజలి ఘటింస్తున్నామన్నారు.

దర్శకుడు సాయిభాను మాట్లాడుతూ... తాను గతంలో డాక్యుమెంటరీ చిత్రాలు తీశానని చెప్పారు. ఈ సినిమా కథ, ఓ అనాథకు సంబంధించిందని, తనకంటూ ఎవరూ లేరని గ్రహించిన వ్యక్తి సమాజానికి వ్యతిరేకదిశలోపయనిస్తాడని చెప్పారు. అదే తమను ప్రేమించే వ్యక్తి మరొకరున్నారనుకుంటే ఆ అనాథ జీవితం ఏవిధమైన మలుపు తిరిగింది అన్నది సినిమాలోని ఆసక్తికర అంశమని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

నిర్మాత మోతుకురి సాంబశివరావు మాట్లాడుతూ... ఓల్డ్‌సిటీ నేపథ్యంలో సాగేకథని, హీరోయిన్ శ్రీదేవి ముస్లిం యువతిగా నటించిందని చెప్పారు. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసే సినిమాకాదన్నారు. చక్కని ఎంటర్ టైన్ మెంట్‌తో కూడిన చిత్రమిదని చెప్పారు.

శ్రీదేవి మాట్లాడూతూ.... ముస్లిం యువతిగా నటిస్తున్నానని, నటనకు అవకాశమున్నసబ్జెక్టని చెప్పారు. రామ్‌లక్ష్మణ్ చక్కగా చిత్రించారని, ఈ చిత్రం కోసం చాలా కష్టపడాల్సివచ్చిందని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో సలీంపాండా, రామరాజు, బ్రహ్మానందం, భానుచందర్, చిత్రం బాషా, ఫాతిమాబాబు తదితరులు నటించారు. కథ... జనార్థన్, సహనిర్మాత... కెల్ల గోపీకృష్ణ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... సాయిభాను.