1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నాగబాబుతో "సాధు" ప్రారంభం

వినోదం వెండితెర కథనాలు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు మరో నిర్మాత కొత్త సినిమా
WD
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుతో మరో నిర్మాత కొత్త సినిమాను తీస్తున్నారు. కెమెరామేన్ అంజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు "సాధు" అనే పేరు ఖరారైంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ఎల్.వి.రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఇటీవలి శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...మానవత్వమున్న హీరో క్యారెక్టర్‌లో సాధుగా నాగబాబు నటిస్తున్నారని చెప్పారు. ఓ అనాధపాపని ఏవిధంగా కాపాడాడో చిత్రాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడన్నదే కథాంశం మని చెప్పారు.

కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాత వెల్లడించారు. ఈ నెల 20 తేదీవరకు తిరిగి సెప్టెంబర్ నెలంతా జరిగే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే... మల్లిడి మోహనగాంధీ, మాటలు... వి.వి.వి దుర్గాప్రసాద్, ఆర్ట్... నారాయణ రెడ్డి, కెమెరా, దర్శకత్వం... అంజి.