జైమారుతి ఫిలింస్ కొత్త సినిమా 70 శాతం పూర్తి!
|
డైరక్టర్ విక్కీ ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని, తనకిది మొదటి సినిమా అయినప్పటికీ యూనిట్ సహకారంతో ఎలాంటి భయం లేకుండా చేస్తున్నానని, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.
దర్శకుడు విక్కీ మాట్లాడుతూ... దర్శకుడుగా ఇది తనకు నాలుగో సినిమా అని, ఇప్పటి వరకు 12 మంది ఫైట్ మాస్టర్స్ దర్శకులుగా మారారని, వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చారు. నిర్మాత శ్రీనివాస్‌గారికి ఈ కథ చెప్పగానే చాలా ఇన్‌స్పైర్ అయి ఈ సినిమా స్టార్ చేశారు. ఇందులో ఉన్న ఐదు పాటలు దేనికవే చాలా డిఫరెంట్‌గా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటాయని చెప్పారు. తన కెరీర్‌లో ఈ సినిమా బిగ్ కమర్షియల్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో మధుసూదన్ మాట్లాడుతూ... ఇది తనకు నాలుగో సినిమా అని, ఇందులో సాఫ్ట్‌వేర్ స్టూడెంట్‌గా చేస్తున్నానని, కొన్ని అనుకోని సంఘటనల కారణంగా జైలుకెళ్లిన తాను జైలు నుంచి బయటికొచ్చి ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాన్నదే కథాంశమని, తనకు మంచి గుర్తింపు తెస్తుందని ఆశించారు.
మరో హీరో మనోజ్ మాట్లాడుతూ... తాను ఇందులో సెకండ్ హీరోగా, కథానాయకుడికి స్నేహితుని పాత్రను పోషిస్తున్నానని, చాలా మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ చిత్రంలో బాబాశెట్టి, రాజా శ్రీధర్, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, రాంరెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా... కె. జగదీష్, ఎడిటింగ్... నందమూరి హరి, సంగీతం.. ఖుద్దూస్, ఆర్ట్... భాస్కర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... విక్కీ.