1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సౌదీలో సల్మాన్ చిత్ర ప్రదర్శనకు బ్రేక్

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కొత్త చిత్రం 'గాడ్ తుస్సే గ్రేట్ హో'పై నిరసనలు
FileFILE
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కొత్త చిత్రం 'గాడ్ తుస్సే గ్రేట్ హో'పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో ఇస్లాం మత బోధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ చిత్ర ప్రదర్శనకు అడ్డంకులు ఆరంభమయ్యాయి. తాజాగా.. సౌదీ అరేబియా ప్రభుత్వం చిత్ర ప్రదర్శనకు బ్రేక్‌ వేసింది.

ప్రేక్షకుల నుంచి లెక్కకుమించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో గత శుక్రవారం విడుదలైన ఆ చిత్రాన్ని తమ దేశంలో ప్రదర్శించరాదని యుఎఇ జాతీయ ప్రసార సంస్థ ఆదేశించినట్లు గల్ఫ్‌న్యూస్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ తాజా చిత్రంలో సల్మాన్‌ సరసన ప్రియాంక చోప్రా నటించగా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషించారు.

ఆ చిత్రం.. 2003లో జిమ్‌ కెర్రీ నటించిన ‘బ్రూస్‌ అల్‌మైటీ’ అన్న హాలివుడ్‌ చిత్రానికి రీమేక్‌. ఆ చిత్రంలో అరుణ్‌ ప్రజాపతి (సల్మాన్‌) తన కష్టాలన్నింటికీ కారణం నీవేనంటూ దైవాన్ని(అమితాబ్‌) నిందిస్తాడు. ఆ చిత్రాన్ని చూసిన వారంతా అమితాబ్‌ దేవునిగా నటించడం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు సౌదీ ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
About Writer
PNR