చవితి నాడు "వినాయకుడు" ఆడియో
|
నిర్మాత మాట్లాడుతూ... ప్రస్తుతం "వినాయకుడు" షూటింగ్ పూర్తయిందని, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎడిటింగ్ పూర్తియిందని తెలిపారు. సాయికిరణ్ అనుకున్నట్లుగా ఈ సినిమాని తీశారని, అనుకున్నదానికన్నా బడ్జెట్ ఎక్కువయినా తృప్తికరంగా వచ్చిందన్నారు. కొత్తదనం ఆస్వాదించేవారికి ఈ సినిమా నచ్చుతుందని చెప్పారు.
జాతీయస్థాయి అవార్డు గ్రహీత పి.జి విందా ఫోటోగ్రాఫీ, శ్యామ్ ప్రసన్న ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారని తెలిపారు. తొలిసినిమానే బాగా చేసిన సోనియా ఈ చిత్రంలో తన నటననుమరింతగా మెరుపులు దిద్దిందని చెప్పారు. "శంకరాభరణం" ఫెమ్ తులసి సెకండ్ ఇన్నింగ్స్‌గా మాచిత్రంలో తన నటించడం మరో ప్రత్యేకత అని చెప్పారు.
దర్శకుడు సాయికిరణ్ అడవి మాట్లాడుతూ... చిన్న బడ్జెట్ చిత్రంగా మొదట తీర్చిదిద్దామని చెప్పారు. కానీ మీడియా హైప్‌వల్ల పెద్ద చిత్రంగా మారిందన్నారు. "ఆ నలుగురు" సినిమాని నిర్మించిన ప్రేమ్‌కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారని తెలిపారు. కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రంగా తీర్చిదిద్దామన్నారు. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకముందని చెప్పారు.