"సూర్యముఖి"గా నయనతార!
టాలీవుడ్ గ్లామర్ క్వీన్
అందచందాలను ఒలకపోస్తూ టాప్ హీరోయిన్ పేరు కొట్టేసిన అందాల ముద్దుగుమ్మ నయనతార "సూర్యముఖి"గా ప్రేక్షకులను అలరించనుంది. మలయాళంలో హిట్టయిన ఈ సినిమాలో అమ్మడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఫజిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం... సాయి నవీన్ క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకోనుంది.
సూర్యముఖిగా నయనతార
కోటేశ్వరరావు, టి. క్రాంతి కుమార్‌ల నిర్మాణ సారథ్యంలో తెలుగులోకి అనువదించేందుకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... "చంద్రముఖి" తరహాలోనే సైకాలజీకల్ కథాంశంతో తెరకెక్కనుందని, సూర్యముఖిగా నటించనున్న నయనతారకు ట్రీట్‌మెంట్ ఇచ్చే సైకియాట్రిస్ట్‌గా మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.|
|
నాజూకు అందాలు
పొన్నప్పచ్చన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటలు... జయప్రసాద్. ఇదిలా ఉండగా, విశాల్ సరసన నయనతార నటించిన "సెల్యూట్" చిత్రం ఆగస్టు 15న విడుదలై, ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.