1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"బ్లాక్ అండ్ వైట్" ఆడియో రిలీజ్

వినోదం వెండితెర కథనాలు మైత్రీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం రాజీవ్‌కనకాల
WD
మైత్రీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాజీవ్‌కనకాల, సింధుతులాని జాకీష్రాప్ ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం "బ్లాక్ అండ్ వైట్". ఒకే ఒక పాటను మాత్రమే కలిగి ఉన్న ఈ సినిమా ఆడియో కార్యక్రమం.. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూథియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆడియో కేసెట్ విడుదల చేశారు. అనంతరం సీడీని కథానాయకుడు కళ్యాణ్‌రామ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ... సినిమా పాటను వనమాలి చక్కగా రాశారని, నిర్మాతకు "బ్లాక్ అండ్ వైట్" మనీరూపంలో కలెక్షన్లవర్షం కురిపించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ... తనకు ఇష్టమైన నటుడు రాజీవ్‌కనకల అని చెప్పారు. అలాగే ఎప్పటినుంచో కీరవాణి సంగీతంలో పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. తర్వాత సినిమాలో తప్పకుండా చేస్తాననీ, ఈ చిత్రానికి పనిచేసిన వారికి చక్కని విజయం చేకూరాలని పేర్కొన్నారు.

గీత రచయిత వనమాలి మాట్లాడుతూ... ఒక్క పాటలోనే కథంతా ఇమిడేట్లుగా దర్శకుడు తనకు అవకాశం కల్పించారని చెప్పారు. సస్పెన్స్‌థ్రిల్లర్ కథాంశమైనా రాయడానికి అనువైనదిగా ఉన్న చిత్రమని చెప్పారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ వేముల పల్లి మాట్లాడుతూ... తాను "వేచివుంటా" అనే చిత్రాన్ని నిర్మించానని, దర్శకుడిగా ఇది తనకు తొలి సినిమా అని చెప్పారు. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజీవ్‌కనకాల, నిర్మాత ఉదయ్‌కిరణ్, ఉత్తేజ్, గాయకుడు సందీప్, హర్షవర్ధన్ తదితరులు కూడా మాట్లాడారు.
About Writer
Harsha Vardhan