రెండున్నరేళ్ళ ప్రేమ వ్యవహారం...!
|
వీరిరువురి మధ్య "ఇంగ్లీష్ కాదల్" అనే తమిళ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను పెద్దలు ఆశీర్వదించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో గురువారం సాయంత్రం శివబాలాజీ, స్వప్నమాధురిల వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
స్వప్నమాధురి ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉందని, షూటింగ్స్ పూర్తికాగానే తామిద్దరం దంపతులు కానున్నామని శివబాలాజీ తెలిపారు. స్వప్నమాధురి తమిళంలో మధుమితగా సుపరిచితురాలు.