1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రిన్స్‌తో జతకట్టనున్న పార్వతి మెల్టన్!

వినోదం వెండితెర కథనాలు యువహీరో మహేష్ బాబు సరసన పార్వతి మెల్టన్
WD
యువహీరో మహేష్ బాబు సరసన పార్వతి మెల్టన్ నటించనుంది. ప్రిన్స్ తదుపరి సినిమాకు దీపికా పడుకునే, ఇలియానా వంటి టాప్ హీరోయిన్లను ఎంచుకునే దిశగా యూనిట్ సన్నాహాలు చేస్తుండగా, ఎట్టకేలకు ప్రిన్స్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను పార్వతి మెల్టన్ కొట్టేసింది. హీరోయిన్ల ఎంపిక కోసం ఫోటో షాట్స్‌ను పరిశీలించి, పార్వతి మెల్టన్‌ను ఎంపిక చేసినట్లు యూనిట్ తెలిపింది.

"వెన్నెల" చిత్రం ద్వారా గుర్తింపు సాధించిన ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రిన్స్ తదుపరి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనుందని చిత్రయూనిట్ వెల్లడించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో యూత్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన "జల్సా" సినిమాలో ఈ భామ నటించింది.

ఇకపోతే ప్రిన్స్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కనకరత్న మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న మహేష్ కొత్త సినిమాకు ఎస్. రమేష్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.
About Writer
Selvi