1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కింగ్‌" యూనిట్‌తో నాగ్ బర్త్‌డే..!

వినోదం వెండితెర కథనాలు అక్కినేని నాగార్జున బర్త్‌డే  రాష్ట్ర రాజధాని భాగ్యనగరం తాజ్ కృష్ట హోటల్‌
WD
అక్కినేని నాగార్జున తన బర్త్‌డేను "కింగ్" యూనిట్‌తో జరుపుకోనున్నారు. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని తాజ్ కృష్ట హోటల్‌లో ఈ నెల (ఆగస్టు) 29వ తేదీ సాయంత్రం "మాస్" తన బర్త్‌డేను వైభవంగా జరుపుకోనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. "కింగ్" బర్త్‌డే పార్టీకి అనంతరం "కింగ్" సినిమా విశేషాల గురించి యానిట్ తెలియజేయనుంది.

ఈ మేరకు ఆ రోజు (29వ తేదీ) సాయంత్రం కింగ్ యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు "కింగ్" సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక మరో విషయమేమిటంటే... గత ఏడాది ఆగస్టు 29వ తేదీన నాగ్ నటించిన "డాన్" సినిమా లోగో ఆవిష్కరించబడటం గమనార్హం. ఇంకేముంది... నాగ్ "బర్త్‌డే" గిఫ్ట్‌గా "కింగ్" సినిమా హిట్టవ్వలాని ఆశిద్దామా...!