1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ట్రిపుల్ ప్లాటినం వేడుకల్లో "ఉల్లాసంగా..."

వినోదం వెండితెర కథనాలు యశోసాగర్ స్నేహా ఉల్లాల్ హీరోహీరోయిన్లు
WD
యశోసాగర్, స్నేహా ఉల్లాల్ హీరోహీరోయిన్లుగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన "ఉల్లాసంగా... ఉత్సాహంగా" చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను జరుపుకుంది. జి.వి ప్రకాష్ స్వరపరిచిన బాణీలు సంగీతాభిమానులను బాగా అలరించాయని సభలో పాల్గొన్న వక్తలు అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, హీరో రాజా, నైజాం డిస్ట్రిబ్యూటర్ శిరీష్, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్, చిత్రహీరో యశోసాగర్ తదితరులు హాజరయ్యారు.

ప్లాటినం డిస్క్‌ను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ తెలియజేసిన శుభాకాంక్షలను క్లిప్పింగ్ ద్వారా ప్రదర్శించారు. "తనకిష్టమైన దర్శకుడు, స్నేహితుడు..కరుణాకరన్, ఫంక్షన్‌ను రాలేకపోతున్నాను.. ఈ సినిమా బాగుందనీ అందరూ చెప్పగా విన్నాను. తీరికలేక చూడలేదు. వీలును చూసి తప్పకుండూ చూస్తాను. ఈ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని" పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... పవన్‌నుంచి పిలుపువస్తే తప్పకుండా మరో చిత్రం చేస్తానని, "ఉల్లాసంగా... ఉత్సాహంగా" చిత్రాన్ని విడుదల చేసిన దిల్‌రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. "తొలిప్రేమ" రిలీజ్ నాటికి పొందిన అనుభూతిని ఈ చిత్రానికి పొందానని తెలిపారు. త్వరలో ఇదే టీమ్‌తో ఈ బేనర్‌లో మూడవ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు.

సంగీత దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ... తొలిసారిగా తనను తెలుగువారికి పరిచయం చేసిన దర్శకుడు కరుణాకరన్ అని, సంగీత ప్రియులకు భాషతో సంబంధం లేదని, తనకు తెలుగు రాకపోయినా... సంగీతాన్ని ఆస్వాదించారు. ఇప్పటికే ఆరు చిత్రాల్లో చేస్తున్నానని, మళ్ళీ కరుణాకరన్ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రంలో చేయనున్నట్లు తెలిపారు.

నటుడు రాజా మాట్లాడుతూ... అంచనాల్లేకుండా ఈ సినిమా చూశానని, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఉత్తమ చిత్రమిదని, వినే సంగీతానికి విజువల్‌గా చూసేటప్పుడు సరైన కొరియోగ్రాఫర్ పడితే పాటలు అద్భుతంగా ఉంటాయని, అవి ఈ చిత్రానికి సరిగ్గా కుదిరాయని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ... ప్రకాష్‌ను తన దర్శకత్వంలో రూపొందుతోన్న "నేను తను ఆమె" చిత్రంలో మొదట అవకాశం కల్పించానని, త్వరలో తన సినిమా ఆడియో విడుదల కానుందని చెప్పారు. కరుణాకర్ తాను కలిసి కొన్ని చిత్రాలకు పనిచేశామని వెల్లడించారు.

దిల్‌రాజు మాట్లాడుతూ... "తొలిప్రేమ" కథ విని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశానని, ఏదీ ఏమైనా కథ బాగుంటేనే అందరూ ఆదరిస్తారని, గోల్డెన్ హ్యాండ్ ఉన్నా లాభంలేదని, ప్రకాష్ తన కెపాసిటీని నిరూపించేందుకు ఈ సినిమా దోహదపడిందని అన్నారు.