1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"యువత" ఆడియో ఆవిష్కరణ

వినోదం వెండితెర కథనాలు హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ కథానాయకుడు అక్ష కథానాయిక
WD
"హ్యాపీడేస్" ఫేమ్ నిఖిల్ కథానాయకుడిగా అక్ష కథానాయికగా నటిస్తోన్న "యువత" చిత్ర ఆడియో ఆవిష్కరణ బంజారాహిల్స్‌లోని పబ్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా "దిల్"రాజు హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించి తొలిప్రతిని "బొమ్మరిల్లు" దర్శఖుడు భాస్కర్‌కు అందించారు. అనంతరం ఆడియో క్యాసెట్‌ను భాస్కర్ విడుదల చేసి చిత్ర నిర్మాత హరికి అందించారు.

అనంతరం పూరీ జగన్నాథ్ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేసే క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. తన దగ్గర పరుశురామ్ పనిచేశారని, అందరూ కొత్తవారితో తీసిన ఈ చిత్రం తాను "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం" తీసిన రోజులను గుర్తు చేసిందని పూరీ వ్యాఖ్యానించారు.

చిత్రదర్శకుడు పరుశురామ్ మాట్లాడుతూ.. తొలుత పూరీ జగన్నాథ్, ఆ తర్వాత భాస్కర్ దగ్గర పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. యువత ఆలోచనలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ అంశాలతో సరికొత్త చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు హరి, ఉమాప్రకాష్ తెలిపారు. ఈ చిత్రం విజయవంతం కావాలని దిల్‌రాజు, భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.