1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "16 డేస్"

వినోదం వెండితెర కథనాలు అరవింద్ ఛార్మీ హీరోహీరోయిన్లు ప్రభు సాలమన్ దర్శకత్వం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు
WD
అరవింద్, ఛార్మీ హీరోహీరోయిన్లుగా ప్రభు సాలమన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "16 డేస్". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. పి. మహేష్‌బాబు డి.వై. చౌదరిల సంయుక్త నిర్మాణ సారథ్యంలో, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై "16 డేస్" తెరకెక్కనుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ ఛార్మీ మాట్లాడుతూ... "16 డేస్‌"లో తాను పోషిస్తున్న పాత్ర తనకిష్టమైన పాత్రని, "ఏంజెల్"గా పిలువబడే ఈ రోల్‌ను ఆసక్తితో చేశానని చెప్పింది. "16 డేస్" తాను పోషించే పాత్ర ద్వారా అగ్ర హీరోల సరసన నటించే అవకాశం తనకు దక్కుతుందని ఛార్మీ ఆశాభావం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా తన కెరీర్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని వెల్లడించింది. ఈ సినిమా కోసం చాలా హోమ్ వర్క్ చేశానని, ఇందులో ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు అద్భుతమైన చిత్రీకరణ తనకెంతో నచ్చిందని ఛార్మీ చెప్పుకొచ్చింది.

దర్శకుడు ప్రభు సాలమన్ మాట్లాడుతూ... ఛార్మీ రోల్ ఈ సినిమాకు హైలైట్ అని, ఈ పాత్రలో ఛార్మీ విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగీతం చక్కగా కుదిరిందని, ఇటీవల విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మూడో వారంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ప్రభు వెల్లడించారు. ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, జైప్రకాష్ రెడ్డి. బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, అలీ, అజయ్, వేణుమాధవ్, మనోరమ తదితరులు నటిస్తున్నారు.