"నేను మీకు తెలుసా?" షూటింగ్ పూర్తి!
|
తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్‌లు చక్కగా రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ కార్యక్రమాలను జరుగుతున్నాయని, ఈ నెల 28న సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు.
సెప్టెంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల అవుతుందని తెలుగు తమిళ సినిమాల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు అన్నారు.
ఈ చిత్ర హీరో అమ్నేషియాతో బాధపడుతుంటాడని, ఓ సారి నిద్రిస్తే జరిగిందంతా మరిచిపోతాడని... ఇలాంటి పరిస్థితుల్లో కథానాయకుడు ఎదుర్కొనే అంశాలనే చిత్రంగా మలిచామని అశోక్ కుమార్ వెల్లడించారు. బ్రహ్మానందం, నాజర్, సునీల్, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... కిషోర్, కెమేరా... సునీల్ కె. రెడ్డి.