దసరాకు బాలకృష్ణ కొత్త చిత్రం..!
|
ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత వివరిస్తూ... పెళ్ళయిన కొత్తలో, యమదొంగ, హరేరామ్‌లో నటించిన ప్రియామణి కథానాయికగా నటిస్తోంది. సమరసింహారెడ్డి, సింహాద్రి, యమదొంగ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించారని అన్నారు.
ఎం. రత్నం సంభాషణలు సమకూరుస్తుండగా, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేస్తున్నారు. మణిశర్మ బాణీలు సమకూరుస్తున్న ఈ సినిమా అక్టోబర్ 9 విజయదశమి పర్వదినాన ప్రారంభించి నెలాఖరువరకూ తొలిషెడ్యూల్ జరుగుతుందని చెప్పారు. అక్కడ నుంచి ప్రతి నెలా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటుందని, చక్కని కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రంలో చంద్రమోహన్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, భరణి, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, ఆహుతిప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, హేమ, ఝాన్సీ నటించనున్నారు. ఫోటోగ్రఫీ... బాల మురుగన్, ఎడిటింగ్... కోలా భాస్కర్, ఆర్ట్... ఆనంద్ సాయి, ఫైట్స్... రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్... సూరపనేని కిషోర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... మహాదేవ్.