1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల రికార్డింగ్‌లో "ఆస్రా నిర్మాణ్"

వినోదం వెండితెర కథనాలు ఆస్రా నిర్మాణ్ అనే కార్పొరేట్ సంస్థ తెలుగు
ఆస్రా నిర్మాణ్ అనే కార్పొరేట్ సంస్థ తెలుగులో నిర్మిస్తోన్న "హైదరాబాద్ (మెట్రో) టైమ్" పాటల రికార్డింగ్‌తో శ్రీకారం చుట్టింది. గురువారం రామానాయుడు స్టూడియోలో చంద్రబోస్ రాసిన "సన్నజాజి పూవులా నవ్వరా..." అనే పల్లవిని ప్రమోద్ కుమార్ సంగీత సారథ్యంలో రికార్డింగ్ చేశారు.

ఇందులో ఆరు పాటలున్నాయని, హరిహరన్ ఈ పాటను పాడుతారని, త్వరలో మిగిలిన పాటల రికార్డింగ్ పూర్తవుతుందని ప్రమోద్ కుమార్ తెలిపారు. సంస్థ ఛైర్మన్ మారున్ మాట్లాడుతూ... హిందీలో నాలుగు చిత్రాలు నిర్మించి విడుదలకు సిద్ధమయ్యాయి.తెలుగులో మొదటిసారిగా ప్రవేశిస్తున్నామని, ఒకే సమయంలో వివిధ రకాల మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయి? అనే అంశాన్ని ఇందులో చర్చిస్తున్నామని, చక్కని సందేశం కూడా ఉందని, ప్రముఖ సినీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

తాను రూపొందించిన "మంజీర" చిత్రం నచ్చి తనకు అవకాశం కల్పించారనీ, టెక్నికల్ వాల్యూస్ హై బడ్జెట్ చిత్రంగా మలుస్తున్నామని చిత్ర దర్శకుడు సాయిభాను చెప్పారు. హిందీలో హారున్ చిత్రాలను తాను డిస్ట్రిబ్యూట్ చేశాననీ, కార్పొరేట్ సంస్థ తెలుగులో రావడం మంచి పరిణామమని నిర్మాణ నిర్వహుకుడు ఆర్.కె. గౌడ్ అన్నారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు... ఆర్. జనార్థన్, పాటలు... వేటూరి, భాస్కరపట్ల, చంద్రబోస్, కెమెరా.. సత్తిబాబు, సహనిర్మాత... బి. సౌమ్య, సమర్పణ... హారున్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత... హారున్, దర్శకత్వం... సాయిభాను.
About Writer
Selvi