"ప్రేమ పిలుస్తోంది" ప్రారంభం!
|
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ చిత్రం గురించి చెబుతూ... సంగీతానికి అవకాశమున్న కథని, ప్రేమకథలో చక్కని ఫీల్ ఉందని చెప్పారు. ఇందులో ఆరు పాటలున్నాయని, కథానుసారంగా పాటలు చక్కగా అమరాయని వెల్లడించారు. ఈ చిత్రంలో "నీ కోసం రాశాను లవ్ లెటర్" అనే పాటను కుమార్ సాను ఆలపిస్తున్నారని, తాను గతంలో బాణీలు అందించిన "దేవుడు వరమందిస్తే.." తరహాలో చక్కని ట్యూన్ అమరిందని కితాబివ్వడం సగం సక్సెస్‌గా భావిస్తున్నానని చెప్పారు.
దర్శకునిగా పరిచయమవుతున్న అజయ్ నాతురి మాట్లాడుతూ.. లవ్, యాక్షన్ అంశాలతో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని, కథకు అనుగుణంగా హీరోను ఏడాదిపాటు మలిచామని, డాన్స్, ఫైట్స్ బాగా నేర్చుకున్నారని చెప్పారు. గతంలో జయగారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారని, చక్కని చిత్రంగా అందరి మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
చిత్ర సమర్పకుడు మేకల సత్యనారాయణ మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్, ఫౌల్ట్రీ రంగాల్లో ఉన్న తమను ఘంటాడి చక్కని కథతో ముందుకు వచ్చి నిర్మాణ రంగంలోకి ప్రవేశించేలా చేశారన్నారు. సెప్టెంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని, ఈ చిత్రం ద్వారా తనకు హీరో గుర్తింపు వస్తుందని చంటి తెలిపారు.
"చందమామ" చిత్రాన్ని చూసి తనకు ఈ చిత్రంలో అవకాశం కల్పించారని సింధు మీనన్ తెలిపింది. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... పూర్ణ, డాన్స్... నాగరాజు, ఆర్ట్... భాస్కర్, నిర్మాత... ఎం. పవన్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... అజయ్ నాతురి.