1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

70 శాతం పూర్తయిన మెషెక్ మూవీ మేకర్స్ చిత్రం!

వినోదం వెండితెర కథనాలు శశాంక్ ఆర్య మీనన్ హీరోహీరోయిన్లు  మెషెక్‌క్ మూవీ మేకర్స్ సంస్థ
WD
శశాంక్, ఆర్య మీనన్ హీరోహీరోయిన్లుగా మెషెక్‌క్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కేరళకు చెందిన ఎన్.ఆర్.ఐ. జాన్ బాప్టిస్ట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మలయాళ దర్శకుడు సిద్ధిక్ అసోసియేట్ శ్రీనివాస్ భల్లా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ... ప్రతిభావంతుడిని ప్రోత్సహిస్తే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసి తన రంగంలో విజయకేతనం ఎగురవేస్తారనే చక్కని సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఇటీవలే మలేషియాలో మూడు పాటల్ని, రామచంద్రాపురంలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడం జరిగిందని చెప్పారు.

ఇప్పటి వరకూ జరిపిన షూటింగ్‌తో 70 శాతం నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల్ని కేరళ, వైజాగ్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

దర్శకుడు శ్రీనివాస్ భల్లా మాట్లాడుతూ... మనం ఎంత క్లాస్‌గా ఉన్నా మాస్ ఎలిమెంట్స్‌కి అనుకోకుండా స్పందిస్తామని, అలాంటి ఇతివృత్తంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని, ఒక ఎమోషనల్ కథను పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ట్రీట్‌మెంట్‌తో రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతీపాటకీ, సన్నివేశాలకీ ప్రేక్షకులు ఎంతగానో స్పందించేలా ఈ సినిమా ఉంటుందని, సెప్టెంబర్ 1 నుంచి చివరి షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.

హీరో శశాంక్ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు మంచి గుర్తింపునిస్తుందని ఆకాంక్షించారు. మోహన్ సితార సంగీతం యువతను ఉర్రూతలూగించడం ఖాయమని అన్నారు.
About Writer
Selvi