"నేను మీకు తెలుసా?" ఆడియో ఆవిష్కరణ!
|
మోహన్‌బాబు కుటుంబంలో తమకు ఎంతో అనుబంధం ఉందని. అలాగే తనకు మోహన్ బాబుకు ఓ విషయంలో పోలిక ఉందని, ఇద్దరమూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో సామీప్యత ఉందని చెప్పారు. ప్రతి సినిమా విజయంలో ఆడియో పాత్ర కీలకమైందని చెప్పారు.
దర్శకుడు అజయ్ శాస్త్రి మాట్లాడుతూ... ఈ కథను తాను మనోజ్‌కు చెప్పినప్పుడు వాళ్ళ నాన్న వద్దకు తీసుకెళ్ళాడని, చాలా భయపడ్డానని, అయితే తనకు ధైర్యం చెప్పి తన వివరాలు అడిగి మోహన్ బాబు గారు తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. వెంటనే.. ఈ సినిమా చేస్తున్నావ్ అని, దర్శకునిగా తనకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ... ఈ సినిమాకు తాను పేరుకే నిర్మాతనని, అంతా మనోజ్ చూసుకుంటున్నారని, తాము చేస్తున్నఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
మనోజ్ మాట్లాడుతూ... ఈ సినిమాను చేయమని చెప్పిన తన తండ్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సునీల్ నుంచి మంచి సపోర్ట్ లభించిందని, తమ సంస్థతో సోనీ డిజిటల్స్ వారు తెలుగులోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ... ఆడియో విడుదల ఉందని రెండు రోజుల క్రితమే తెలిసిందని, ఇంత తక్కువ సమయంలో పిలవగానే బాలకృష్ణ, రాఘవేంద్ర రావులు వచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వై.వి.ఎస్. చౌదరి, కోదంరామిరెడ్డి, స్నేహా ఉల్లాల్, సునీల్, సునీల్ కె. రెడ్డి, సోనీ డిజిటల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.