1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"నాగ్ ది కింగ్ డాట్ కామ్" వెబ్‌సైట్ విడుదల

వినోదం వెండితెర కథనాలు నాగార్జున కింగ్ శుక్రవారం రాత్రి తాజ్ డెక్కన్‌ సమావేశం ఏర్పాటు నాగ్ ది కింగ్ డాట్ కామ్ వెబ్‌సైట్ విడుదల
WD
నాగార్జున నటిస్తోన్న "కింగ్" కబుర్లు చెప్పేందుకు శుక్రవారం రాత్రి తాజ్ డెక్కన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా "నాగ్ ది కింగ్" డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దర్శక నిర్మాతలు ఎంతగా మాట్లాడిన కింగ్ సినిమాలోని పాయింట్‌ను రాబట్టకుండా మాట్లాడారు.

శ్రీనువైట్లతో ఎంత కంఫర్ట్‌బుల్‌గా ఉందంటే... తన కుమారుడు నాగచైతన్య చేసే రెండో సినిమాకు ఆయనే దర్శకుడు, ఇదే బేనర్‌లోనే రూపొందనుందని ఈ సందర్భంగా నాగార్జున వెల్లడించారు. ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుందని, ఇందులో తాను మూడు పాత్రల్లో కన్పిస్తానని, అది ఎలా అనేది ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పారు. శ్రీహరి జ్ఞానేశ్వర్ దాదా అనే పాత్రలో నటించారని, తను కూడా మంచి ఆర్టిస్ట్ అని నాగ్ అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ఒక మంచి వ్యక్తితో సినిమా చేయడం ఆనందంగా ఉందని, తన గత చిత్రాలను తీసుకుంటే వాటికి శ్రీనువైట్ల దర్శకత్వంలో ఫలానా వారు నటిస్తున్నారని చెప్పేవారని, ఈ సినిమాకు నాగార్జునగారే కింగ్ అని అన్నారు. నాగార్జున హీరోగా చేసే సినిమాకు దర్శకత్వం వహించడంపై కొంత జంకినా, ఆయన దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు. ఈ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉంటుందని వెల్లడించారు.

రచయిత కో, వెంకట్ మాట్లాడుతూ.. ఒత్తిడిలో ఉన్నవారు ఈ సినిమా చూస్తే చాలు ఒత్తిడిపోయి ఉత్సాహులవుతారని అన్నారు. నిర్మాత.. డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమా గురించి తాను డిసెంబర్ 16వ తేదీన మాట్లాడుతానని చెప్పారు.