"పోలీస్... పోలీస్..." 80శాతం షూటింగ్ పూర్తి!
|
లాంగ్ లెన్త్ డైలాగ్‌లు, కమర్షియల్ ఫార్మూలాలతో "పోలీస్.. పోలీస్.." రూపుదిద్దుకుంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇకపోతే హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మన్మోహన్ దర్శకత్వం వహిస్తుండగా, చందు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... పోలీసు శాఖకు గౌరవమిచ్చే కథాంశంతో, ఇద్దరు యువ పోలీసు అధికారులు సామాజిక అసమానతలను తొలగించేందుకు ఎలా పోరాడుతారనే పాయింట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకులు వెల్లడించారు.