1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చివరి పాటలో "కాశీపట్నం చూడర బాబు..!"

వినోదం వెండితెర కథనాలు ఆనంద్ సుప్రేన హీరోహీరోయిన్లు మద్దిరాల వెంకట్ దర్శకత్వం కాశీపట్నం చూడర బాబు
WD
ఆనంద్, సుప్రేన హీరోహీరోయిన్లుగా, మద్దిరాల వెంకట్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "కాశీపట్నం చూడర బాబు..!". ఎం.ఎస్.ఎం నిర్మాణ సారథ్యంలో, ఎం.ఎస్.ఎం వెంకట సాయి సినీ పార్క్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. చివరి పాట చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ... మద్దిరాల వెంకట్‌ను ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని అన్నారు.

సీనియర్ డైరక్టర్ వంశీ దర్శకత్వం వహించిన అనేక సినిమాల్లో వెంకట్ పనిచేశారని చెప్పారు. గ్రామజీవన బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. చివరి పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తునట్లు నిర్మాత వెల్లడించారు.

ఇకపోతే... తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, ఎం.ఎస్. నారాయణ, గుండు సుదర్శన్, సారిక, జయలలిత, నిఖిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... రచయిత. మోహన్, కెమేరా... జవహర్ రెడ్డి, సంగీతం... చక్రి.
About Writer
Selvi