1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"పెదరాయుడు" చోటనే సలీం షూటింగ్ ప్రారంభం!

వినోదం వెండితెర కథనాలు మోహన్ బాబు రజనీ కాంత్ పెద రాయుడు హైదరాబాద్‌
WD
మోహన్ బాబు, రజనీ కాంత్ నటించిన "పెద రాయుడు" చిత్రం ప్రారంభించిన హైదరాబాద్‌లోని తాజ్ డక్కన్‌లోని ఓపెన్ ప్లేస్‌లో శ్రీ లక్ష్మీ ప్రసన్న 50వ చిత్రం సోమవారం ప్రారంభమైంది. మంచు విష్ణువర్ధన్, ఇలియానాపై ముహూర్తపు షాట్ చిత్రించారు. తనకు చాలా ఇష్టమైన వాళ్ళతో తక్కువ మాట్లాడతానని, విష్ణువర్ధన్ అనగా, మరి నేనంటే... నీకు... అని ఇలియానా అనే డైలాగ్‌ను ముహూర్తపు షాట్‌గా చిత్రించారు.

ఈ సన్నివేశానికి దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. హీరో ప్రభాస్ కెమేరాకు హారతి ఇచ్చారు. నందమూరి కళ్యాణ్ రామ్ జ్వోతి ప్రజ్వల గావించారు.

ఈ చిత్రం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ... వై.వి.ఎస్. చౌదరి అసిస్టెంట్ డైరక్టర్‌గా నుంచి తెలుసునని, దర్శకుడవుతావని అప్పుడే చెప్పినట్లు వెల్లడించారు. కానీ ఆయన గురువు కె. రాఘవేంద్రరావు మాత్రం.. ఎందుకురా అప్పుడే చెడగొడతావ్! అని అనేవాడని చెప్పుకొచ్చారు.

అంటే ఇంకా బాగా నేర్చుకుని వెళ్ళమని ఆయన ఉద్దేశమని, స్వయం కృషితో పైకొచ్చారని, తన బేనర్‌లో తనను చేయమని అడిగారని, తన బేనర్‌లో ఆయన దర్శకత్వం వహించడం భగవంతుని ఆశీస్సులని, తన బేనర్‌లో భారీ బడ్జెట్ గల చిత్రమిదని, కథ తనకు పూర్తిగా నచ్చడంతోనే నిర్మాణ సారథ్యం వహించి... "పెదరాయుడు" ప్రాంతంలోనే ఓపెనింగ్ చేశామని అన్నారు.

అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో రజనీకాంత్ తాను నటించిన "పెదరాయుడు" సినిమా సూపర్‌ హిట్ అయిందని, ఆ చిత్రం లాగానే "సలీం" అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

వై.వి.ఎస్. చౌదరి మాట్లాడుతూ... "ప్రతిజ్ఞ" సినిమాతో ఈ బేనర్‌ ప్రారంభమైంది. ఎంతో మంది ఉద్దండులు దర్శకులుగా పనిచేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని, నిర్మొహమాటంగా గంభీర చతురత ప్రదర్శించే మోహన్‌బాబును చూస్తే ఇద్దరు గుర్తుకు వస్తారని, బీహార్‌లో లల్లూ ప్రసాద్ యాదవ్, ముంబైలో బాల్ ధాకరే, తెలుగు ఇండస్ట్రీకి మోహన్ బాబు అంటూ పోల్చారు.

ఇందులో మోహన్ బాబు వైవిధ్య పాత్రను పోషిస్తున్నారని, ఎంటర్‌టైన్‌మెంట్ చేసే నెగటివ్ పాత్ర అని, అలా అని విలన్ కాదని చెప్పారు. ఈ సినిమా కథ వైవిధ్యమైన లవ్‌స్టోరీ అని, తన గత చిత్రాలైన లాహిరి... లాహిరి, దేవదాసు ఇరు సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో "సలీం" కూడా అలానే ఉంటుందన్నారు.

"దుమ్మురేపుతాడు" అనే టాగ్‌లైన్‌ కూడా జతచేశామని, పది రోజుల గ్యాప్ తర్వాత 15, 16 తేదీ నుంచి షూటింగ్ ప్రారంభించి రాజమండ్రి, హైదరాబాద్‌లోనూ, అమెరికా, మలేషియాల్లోనూ జరిగే షెడ్యూల్తో పూర్తి చేస్తామని, ఎఫ్.డి.సి నిబంధనల మేరకే చిత్ర ముంటుందని, మార్చినెలలో సినిమాను విడుదల చేస్తామన్నారు.

విష్ణు వర్ధన్ మాట్లాడుతూ... వై.వి.ఎస్. చౌదరితో పనిచేయడం గర్వంగా ఫీలవుతున్నానని చెప్పారు. తన కిష్టమైన రచయిత గోపీ, మోహన్‌లని, వారు తన సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉందని, చాలా బిజీగా ఉన్న తన సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనువైట్ల మాట్లాడుతూ... పెదరాయుడు తరహాలో విజయం సాధించాలన్నారు. ఇలియానా మాట్లాడుతూ... ఈ బేనర్‌లో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి కెమెరా.. రాం ప్రసాద్, పాటలు... చంద్రబోస్, సంగీతం... సందీప్ చౌతా, నిర్మాత.. మోహన్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... వై.వి.ఎస్. చౌదరి.
About Writer
Selvi