యాక్షన్ సన్నివేశాల్లో "సమర్థుడు"
|
నిర్మాతల్లో ఒకరైన ఆకుల సురేష్ మాట్లాడుతూ... మొదటి షెడ్యూల్ 20 రోజుల పాటు నిరవధికంగా సాగిందని, 25శాతం టాకీ పూర్తయిందని, అమ్మ రాజశేఖర్ ఆధ్వర్యంలో హీరో హీరోయిన్లపై ఓ పాట చిత్రించామని చెప్పారు.
మరో నిర్మాత ఎన్. విజయ్ రెడ్డి మాట్లాడుతూ.. రెండో షెడ్యూల్ ఆదివారం నుంచి ప్రారంభించామని, కీలక యాక్షన్ సన్నివేశాలను 16 రోజుల పాటు చిత్రీకరిస్తామని చెప్పారు. దర్శకుడు ప్రతి ఫేమును అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు.
వినోద్ కుమార్, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, సలీమ్ ఫండా, దండపాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం... వి. రాజశేఖర్, కెమెరా... దత్తు, మాటలు.. శ్రీను మల్కారి, రచన సహకారం... రాజు ఊడిముడి, జి. సురేష్.