పిసినారి ప్రేమకథగా "నిన్ను చేరాలని..!"
|
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాలాదిత్య మాట్లాడుతూ.. గడ్డం గీసుకుంటే డబ్బులైపోతాయనుకునే పిసినారిగా నటిస్తున్నానని, ప్రేమ ఫెయిల్ అవుతుందని, చివరికి ఒకటెలా అయ్యామన్నదే చిత్రకథని, సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు చేరుతుందన్నారు.
చిత్రాన్ని దసరానాడు విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. అందరి సహకారంతో అనుకున్నది అనుకున్నట్లుగా తీశానని దర్శకుడు వి.వి.వి. సత్యనారాయణ చెప్పారు. ఇందులో టిపికల్ దొంగ పాత్ర పోషిస్తున్నానని కృష్ణభగవాన్ పేర్కొన్నారు.
సంప్రదాయ కుటుంబంలో పెరిగిన అమ్మాయిగా కనిపిస్తానని హీరోయిన్ రూప చెప్పింది. ఈ సినిమాలో సానియా "అల్లరి" సుభాషిణి, కొండవలస, గౌతంరాజు, హేమ సుందర్, చిన్నా, రాగిణి, కళ్ళు కృష్ణారావు తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కథ, మాటలు... అజయ్ కుమార్, కెమెరా... మురళీ కృష్ణ, సంగీతం... అర్జున్, ఎడిటింగ్... రంగస్వామి, పాటలు.. తాటి శివ, యల్. నవీన్.