రేపు ''పులి'' పుట్టిన రోజు వేడుకలు
|
ఈ చిత్రానికి దర్శకనటుడు ఎస్.జే.సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన లండన్ భామ నిఖిషా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లండన్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. ముంబైలో మోడలింగ్ చేస్తోంది. బాలీవుడ్ అగ్రనటి ఖత్రినాకైఫ్ లాంటి సౌందర్య పోలికలు కలిగిన ఈ కొత్తబొమ్మ తెలుగు వెండి తెరపై తన అందాలను ఆరబోసేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్, దిల్‌సుఖ్ నగర్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తదుపరి షెడ్యూల్ ఈనెల ఐదో తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్ పది రోజుల పాటు తలకోన అడవుల్లో జరుగనున్నట్టు ఫిల్మ నగర్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆలీ, చరణ్ రాజ్, మనోజ్ బాజ్‌బాయ్ తదితరులు నటిస్తున్నారు.